Tuesday, November 19, 2024

సొంత జాగ ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు.. ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సర్కార్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయనుంది. ఈమేరకు బడ్జెట్‌లో మంత్రి హరీశ్‌ రావు కేటాయింపులు చేసినట్లు తెలిపారు. సొంత స్థలంలో రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి ఒక్కొక్కరికీ రూ.3లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. సొంత స్థలం ఉన్న 4 లక్షల మందికి రూ.3 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. నియోజకవర్గానికి 3వేల ఇళ్లను బడ్జెట్‌లో కేటాయించింది. వీటిలో 3లక్షల 57వేల ఇండ్లు ఎమ్మెల్యేల పరిధిలో ఉంటాయి. 43వేల ఇళ్లు ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వాసితులకు, వివిధ ప్రమాద బాధితులకు కేటాయించేందుకు వీలుగా సీకం పరిధిలో ఉంటాయి.

ఈ పథకంతో చాలా మంది సామాన్యులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు డబుల్‌ బెడ్‌రూమం ఇళ్లను నిర్మిస్తోంది. రెండు పడకల గదుల నిర్మాణంతో రాష్ట్రంలో చాలా మంది పేద ప్రజలు ఇప్పటికే లబ్ధి పొందారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణం కోసం రూ.12000 కోట్లను ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించింది. తాజాగా సొంత స్థలం ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement