Friday, November 22, 2024

రూ. 2వేల నోట్లు తగ్గుతున్నాయి!

దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోట్ల వాటా క్రమంగా తగ్గుతున్నది. గత కొన్నేళ్లుగా కొత్తగా రూ. 2000 నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా (ఆర్‌బీఐ) ప్రింట్‌ చేయడం లేదు. సర్క్యూలేషన్‌లో ఉన్న రూ.2వేల నోట్ల విలువ మొత్తంగా 17.3 శాతం నుంచి 13.8 శాతం తగ్గిపోయినట్టు ఆర్‌బీఐ 2022 వార్షిక రిపోర్టులో తేలిం ది. సర్క్యూలేషన్‌లో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో రూ.2వేల బ్యాంకు నోట్ల సంఖ్య కేవలం 1.60 శాతం లేదా రూ.214 కోట్లు మా తమే అని ఆర్‌బీఐ తెలిపింది. 20 21 ఆర్థిక సంవత్సరంలో వీటి సంఖ్య 2 శాతంగా ఉండగా.. అంతకుముందు ఏడాది 2.4 శాతంగా ఉంది.

చెలమణిలో ఉన్న అన్ని డినామినేషన్‌ కరెన్సీ నోట్ల సంఖ్య ఈ ఏడాది మార్చి నాటికి రూ.13,053 కోట్లకు పెరిగింది. అంతకుముం దు ఏడాది ఈ నోట్ల సంఖ్య రూ.12,437 కోట్లుగా ఉండేది. మా ర్చి 2020 చివరి నాటికి సర్క్యూలేషన్‌లో ఉన్న రూ.2వేల డినామినేషన్‌ నోట్ల సంఖ్య రూ.274కోట్లుగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement