Friday, November 22, 2024

మాల్యా, నీరవ్‌, చోక్సీ నుంచి రూ.18వేల కోట్ల రికవరీ.. సుప్రీం వద్ద రూ.67వేల కోట్ల విలువైన కేసులు

వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి.. విదేశాల్లో తలదాచుకుంటున్న పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు అయిన విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీతో పాటు మెహుల్‌ చోక్సీ నుంచి రూ.18,000 కోట్లు రికవరీ చేసి.. బ్యాంకులకు అందజేసినట్టు సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుతం తెలియజేసింది. సుప్రీం కోర్టు ముందు.. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం లేదా పీఎంఎల్‌ఏలో భాగంగా.. రూ.67,000 కోట్ల విలువ చేసే పెండింగ్‌ కేసులు ఉన్నాయి. పీఎంఎల్‌ఏ కింద నేరాలను విచారించడం, సాధీనం చేసుకోవడం, దర్యాప్తు చేయడం, ఆస్తులు అటాచ్‌ చేయడం కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు అందుబాటులో ఉన్న విస్తృత అధికారాలను సవాల్‌ చేస్తూ.. దాఖలైన పిటిషన్‌లపై సుప్రీం కోర్టు ధర్మాసనం బుధవారం విచారించింది.

త్రిసభ్య ధర్మాసనం విచారణ..

సీనియర్‌ న్యాయవాదులు.. కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మను సింఘ్వీ, ముకుల్‌ రోహత్గిdలతో సహా పలువురు సీనియర్‌ అడకేట్లు.. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం లేదా పీఎంఎల్‌ఏకి ఇటీవల చేసిన సవరణల ద్వారా అధికార దురినియోగం చేసే అవకాశం ఉందని సుప్రీం కోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. జస్టిస్‌ ఎంఎం ఖనివిల్కర్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరీతో పాటు జస్టిస్‌ సిటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు.

ప్రస్తావన లేని కీలక అంశాలు..

సీనియర్‌ న్యాయవాదులు తమ పిటిషన్‌లో కీలక అంశాలను ప్రస్తావించారు. కఠినమైన బెయిల్‌ షరతులు, అరెస్టుకు గల కారణాలు తెలియజేయకపోవడం, ఈసీఐఆర్‌ (పోలీసులు దాఖలు చేసిన ప్రథమ సమాచార నివేదికకు సమానంగా) సరఫరా చేయని వ్యక్తుల అరెస్టు వంటి అనేక కీలక అంశాలు చట్టం విమర్శించిందని తెలిపారు. మనీ లాండరింగ్‌, నేరాల ద్వారా వచ్చిన ఆదాయం, విచారణ సమయంలో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు, విచారణ సమయంలో సాక్ష్యంగా అంగీకరించబడుతాయి. విదేశాలతో పోలిస్తే.. భారతదేశంలో మనీ లాండరింగ్‌ యాక్టులో చాలా తక్కువ సంఖ్యలో కేసులను విచారణకు తీసుకుంటున్నట్టు ముగ్గురు సభ్యలతో కూడిన ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్రం యూకేను ఉదాహరణగా తీసుకుంది. ఇక్కడ మనీ లాండరింగ్‌ కింద సంవత్సర కాలంలో.. 7,900 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో 1532 కేసులు, చైనాలో 4691 కేసులు, ఆస్ట్రియాలో 1036 కేసులు, హాంకాంగ్‌లో 1823 కేసులు, బెల్జియంలో 1862 కేసులు, రష్యాలో 2764 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

4,700 పీఎల్‌ఎంఏ కేసులు..

భారతదేశంలో 4,700 పీఎల్‌ఎంఏ కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు చేస్తోంది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న నేరాల మొత్తం విలువ రూ.67,000 కోట్లు అని కేంద్రం వివరించింది. గత ఐదేళ్లలో ప్రతీ సంవత్సరం విచారణకు తీసుకున్న కేసుల సంఖ్య 2015-16లో 111 కేసుల నుంచి 2020-21 నాటికి 981కు చేరుకుందని కేంద్రం వివరణ ఇచ్చింది. గత ఐదేళ్లలో 2016-17 నుంచి 2020-21 వరకు) ఇటువంటి నేరాలకు సంబంధించి 33లక్షల ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. కానీ 2086 కేసులు మాత్రమే విచారణకు స్వీకరించినట్టు కేంద్రం తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement