అంతర్జాతీయంగా ధరలు భారీగా తగ్గినందున వెంటనే కంపెనీలు వంటనూ నెలపై లీటర్‌కు 15 రూపాయలు తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశంతో మదర్ డైయిరీ సోయాబీన్, రైస్ బాన్ ఆయిల్‌పై లీటర్‌కు 14 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సన్‌ప్లవర్ ఆయిల్‌లో త్వరలోనే తగ్గిస్తామని తెలిపింది. ఈ కంపెనీ ధారా బ్రాండ్ పేరుతో వంటనూనెలను మార్కెట్ చేస్తోంది. దేశీయ అవసరాల్లో 60 శాతం వంట నూనెలను మన దేశం దిగుమతి చేసుకుంటోంది. కొన్ని కంపెనీలు ఇంకా ధరలు తగ్గించలేదని, ఇవి వెంటనే ధరలు తగ్గించాలని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ నెల 6న తయారీదారులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు కోరామని, ఇటీవలే లీటర్‌కు 10 రూపాయలు తగ్గించాలని సప్లయ్ దారులకు, తయారీదారులకు చెప్పామని తెలిపారు.
తాజాగా అంతర్జాతీయ ధరలు మరింత తగ్గినందున కనీసం లీటర్‌కు 15 రూపాయలు తగ్గించాలని ఆ ప్రకటనలో కోరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వంటనూనెల ధరలు 300 నుంచి 450 డాలర్ల వరకు తగ్గాయని, ఈ ధరలు దేశీయ మార్కెట్లో తగ్గేందుకు మరికొంత సమయం పడుతుందని కంపెనీలు తెలిపాయి. మన దేశం ప్రధానంగా పామ్ ఆయిల్‌ను ఇండోనేషియా, మలేషియా, థాయిల్యాండ్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. సోయాబీన్ ఆయిల్‌ను అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సన్‌ప్లవర్ నూనెను ఉక్రెయిన్, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.