రైతన్నల కోసం మూడేళ్లలో రూ.1,27, 823కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ తెలిపారు. రాప్తాడులో ఆయన మాట్లాడుతూ.. రైతన్నలకు మేలు చేసే విషయంలో దేశంతో పోటీ పడుతున్నాం అన్నారు. మన రాష్ట్రంలో జరుగుతున్న మార్పులను పక్క రాష్ట్రాలు వచ్చి చూస్తున్నాయన్నారు. రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు చెల్లించాం. రైతన్నలకు మేలు చేసే విషయంలో దేశంతో పోటీ పడుతున్నాం. రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు చెల్లించాం. దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ఆర్బీకేలు రైతన్నను పట్టుకొని నడిపిస్తున్నాయి. మూడేళ్లలో రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ. 25,800 కోట్లు ఖర్చు పెట్టాం. గత ప్రభుత్వం రూ.8750 కోట్లు పెట్టిన ఉచిత విద్యుత్ బకాయిలను తీర్చాం. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. పంటల బీమా పథకంపై దృష్టి పెట్టి విప్లవాత్మక మార్పులు తెచ్చామని జగన్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.3,411 కోట్ల పంట బీమా మాత్రమే ఇచ్చారు. మన ప్రభుత్వ మూడేళ్ల హయాంలో మూడేళ్లలోనే రూ.6,685 కోట్ల బీమా చెల్లించాం. రైతులను చంద్రబాబు ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా మనమే తీర్చాం. ఏ సీజన్‌లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తున్నామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement