కొత్త ఏడాది సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన వినియోగదారులకు కాస్త ఉపశమనం కల్పించే ప్రకటన చేసింది. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.102.50 మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ధర తగ్గింపు జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చింది. తాజా తగ్గింపుతో దేశరాజధాని న్యూఢిల్లిలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,004కి దిగొచ్చింది. తగ్గింపు తర్వాత కలకత్తాలో రూ.2074.5, ముంబైలో రూ.1951కి తగ్గాయి. ఇక చెన్నయ్‌లో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధర రూ.2,134.50 వద్ద ఉంది.
కాగా గృహ వినియోగ సిలిండర్‌పై ధర తగ్గింపు లేదు. ధరలు యథాతథంగా కొనసాగుతాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి.కాగా గత నెల డిసెంబర్ 1న కమర్షియల్ గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు రూ.100 మేర పెంచడంతో రూ.2101 చేరింది. 2012-13లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2200 కాగా ఆ తర్వాత ఇదే అధికంగా ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital