Tuesday, November 26, 2024

10వ త‌ర‌గతిలో 10 జిపిఎ సాధించిన ప్ర‌తి విద్యార్ధికి రూ.10 వేలు గిఫ్ట్..

సిద్దిపేట – ప‌ద‌వ త‌ర‌గ‌తిలో 10 జిపిఎ సాధించిన ప్ర‌తి విద్యార్ధికి రూ.10 వేలు రివార్డ్ ఇవ్వ‌నున్న‌ట్టు మంత్రి హారీష్ రావు ప్ర‌క‌టించారు.. అలాగే 100 శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలకు రూ.25 వేలు అందిస్తామ‌ని పేర్కొన్నారు..10వ తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షకు ప్రిపేర్ కావడంపై జరిగిన సమీక్షా సమావేశంలో హరీష్‌ రావు మాట్లాడుతూ, 10వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలనే లక్ష్యంతో ఒక్కో ఉపాధ్యాయుడు, ప్రజాప్రతినిధి ఒక్కొక్కరు 10 మంది విద్యార్థులను దత్తత తీసుకోవాలని మంత్రి సూచించారు. 10వ తరగతి విద్యార్థుల కోసం జిల్లా యంత్రాంగం డిజిటల్‌ కంటెంట్‌ను సిద్ధం చేస్తోందని, దీని వల్ల విద్యార్థులు పరీక్షలకు మరింత మెరుగ్గా సన్నద్ధమవుతారని హరీష్‌ రావు తెలిపారు. విద్యార్థుల కోసం మెటీరియల్‌ సిద్ధం చేయడమే కాకుండా ప్రతి చాప్టర్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని మంత్రి తెలిపారు. విద్యార్థులు ప్రతి అధ్యాయం కోసం ప్రత్యేకంగా బోర్డు పరీక్షల కోసం రూపొందించిన డిజిటల్ కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. జిల్లాలో 10 వేల మందికి పైగా 10వ తరగతి విద్యార్థులకు మెటీరియల్, డిజిటల్ కంటెంట్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వి రోజా శర్మ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తదితరులుఈ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement