Tuesday, November 26, 2024

ఆస్కార్ కి అడుగు దూరంలో..

ఆస్కార్‌ నామినేషన్స్‌లో ”నాటు… నాటు..” పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఎంపికకావడంతో భార తీయ చిత్రపరిశ్రమలో ఆనందం వెల్లివిరుస్తోంది. పాటకు ఆస్కార్‌ పురస్కారం మరొక్క అడుగు దూరంలోనే ఉందని ప్రశంసిస్తూ పలురు సెలబ్రిటీలు ట్వీట్లుచేస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ ఆర్‌’ చిత్రానికి ఆస్కార్‌ ఖాయమనే మాట వినిపిస్తోంది. దీనిని బలపరుస్తూ గతంలో ఆస్కార్‌ పురస్కారం అందు కున్న సినిమాలను, పాటలను ఉదహరిస్తున్నారు. ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌, లాస్‌ఎంజెల్స్‌ ఫిల్మ్‌ క్రిటిక్‌ అవార్డులు గెలుచు కున్న పాటలకు ఆస్కార్‌ లభించిందని వారంటున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రవితేజ, రక్షిత్‌ శెట్టి, మంచు విష్ణు, ప్రేమ్‌ రక్షిత్‌, తెలంగాణ గవర్నర్‌ తమిళసై తదితరులు ”తెలుగు సినిమా ఆస్కార్‌ కోసం తుదిబరిలో నిలవడం పోటీపడుతుండటం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం” చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ఆస్కార్‌ బరి వరకు తీసుకెళ్లిన రాజ మౌళిని ప్రశంసిస్తూ, చిత్ర యూనిట్‌ను అభినందిస్తున్నారు.
ఎంతో ఆతృతగా ఎదురుచూసిన నామినేష్‌ గట్టం ముగిసింది. నామినేషన్‌ వచ్చాక ఆ తర్వాత ఏం జరుగుతుం ది? అనేది ఆసక్తికరం. మన దేశం నుండి ఇప్పటి దాకా అధికారికంగా ఎంట్రీ- సంపాదించిన మదర్‌ ఇండియా, సలామ్‌ బాంబే, లగాన్‌ చిత్రాలు నామినేషన్స్‌ వరకు వెళ్లా యి. కానీ దాంతోనే సంతృప్తి చెందవలసి వచ్చింది. ఎందు కంటే నామినేషన్‌ పొందిన తరువాత ఆస్కార్‌ అవార్డుల ఎంపిక చేసే విధానానికి అనువుగా మనం నామినేషన్‌ సంపాదించిన కేటగిరీల్లో ఓట్లు- పోగేయడానికి తగిన
కృషి చేయాలి.
అకాడమీలో దాదాపు పదివేల మంది సభ్యు లుంటారు. వీరిలో కనీసం 9,500 మంది ఓటు- హక్కు కలిగి ఉంటారు. అసలు ఆస్కార్‌ సభ్యత్వం ఎలా లభిస్తుం ది? గతంలో ఆస్కార్‌ నామినేషన్‌ పొందినవారు, ఆస్కార్‌ విజేతలు అందరూ సభ్యత్వం పొందినవార వుతారు. వీరిని 17 బ్రాంచెస్‌ గా విభజిస్తారు. ఒక్కో బ్రాంచ్‌ కు 550 మంది సభ్యులు ఓటు- వేసే హక్కు లభిస్తుంది. అయితే నటన విభాగంలో మాత్రం 1300 మంది ఓటర్లు ఉంటారు. వీరు ఉత్తమ నటు-డు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటు-డు, ఉత్తమ సహాయనటి అవార్డు లను ఎన్నుకుంటారు.
ఈ సారి డిసెంబర్‌ 12 నుండి 15 వరకు ప్రిలిమనరీ ఓటింగ్‌ జరిగింది. డిసెంబర్‌ 21న ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్స్‌ ప్రకటించారు. అందులో ఆర్‌ఆర్‌ఆర్‌ ఉంది. 2023 జనవరి 12 నుండి నామినేషన్స్‌ ఓటింగ్‌ జరిగింది. ఈ ఓటింగ్‌ జనవరి 17న ముగిసింది. 2023 జనవరి 24న నామినేషన్స్‌ ను ప్రకటించారు. 2023 ఫిబ్రవరి 13న ఆస్కార్‌ నామినీస్‌ లంచ్‌ ఉంటు-ంది. ఇందులో నామినీస్‌ పాల్గొని ఫోటోలకు ఫోజులివ్వడం, పరిచయాలు చేసుకోవడం వంటివి సాగు తాయి. 2023 మార్చి 2 నుండి 7 వరకు ఫైనల్‌ ఓటింగ్‌ సాగుతుంది. ఇదే కీలక ఘట్టం. 2023 మార్చి 12న జరిగే ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో విజేతలెవరో తేలుతుం ది. ఇంత తతంగం సాగుతుంది. కాబట్టే ఆస్కార్‌ బరిలో అవార్డులు గెలవాలని సినీజనం ఆశిస్తూ ఉంటారు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌ లో ట్రిపుల్‌ ఆర్‌ కు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, నాన్‌-ఇంగ్లిష్‌ మూవీ కేటగిరీల్లో నామినేషన్స్‌ లభించాయి. అయితే బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ అవార్డును మాత్రమే దక్కిం చుకోగలిగింది. మరి ట్రిపుల్‌ ఆర్‌కు ఏయే విభాగాల్లో నామినేషన్లు లభిస్తాయో జనవరి 24న తేలనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement