అమెజాన్ ప్రైమ్.. రూ.30 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన చిత్రాలను అమెజాన్ కొనుగోలు చేస్తోంది. వీటిని పే ఫర్ వాచ్ పద్ధతిలో విడుదల చేస్తోంది. యు.ఎస్ లో కూడా ఇప్పటి వరకు కొన్ని చిత్రాలను అమెజాన్ ఈ పద్ధతిలో విడుదల చేసింది. ఒక రోజులో ఎంత మంది డబ్బులు పే చేసి చూస్తారో అంత డబ్బులు వస్తాయి. ఆ లెక్కలో దాదాపు రూ.200 కోట్లకు పైగానే లాభాలు వస్తాయని అమెజాన్ RRR మేకర్స్‌కు చెప్పారట. అయితే RRR టీమ్ అందుకు ఒప్పుకోలేదట. ఇలాగైతే సినిమాకు పెట్టిన ఖర్చు రాదనేది మేకర్స్ అభిప్రాయంగా చెబుతున్నారు.
RRR కోసం రూ.400 కోట్లకు పైగానే ఖర్చు పెట్టినట్లు నిర్మాతలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు సినిమాను విడుదల చేస్తేనే వర్కవుట్ అవుతుందనేది వారి నమ్మకంగా కనిపిస్తోంది. సినిమా థియేటర్స్‌లో విడుదలైతే అమెజాన్ ఆఫర్ చేసిన డబ్బులు ఓ రోజులోనే వచ్చేస్తాయి. అలాంటప్పుడు మేకర్స్ ఇలాంటి డీల్‌కు ఎందుకు ఒప్పుకుంటారు. కాబట్టి సింపుల్‌గా నో చెప్పేశారని సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital