రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన సీబీటీ-1 పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీ, ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధం అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీ కింద దాదాపు 35వేల పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్‌ఆర్‌బీ 2019లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌కు నిరుద్యోగుల నుంచి భారీగా స్పందన లభించింది. సుమారు కోటి మందికిపైగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు. అప్లికేషన్‌ల సంఖ్య ఎక్కువగా ఉండటం, దానికి కరోనా తోడవ్వడంతో పరీక్షల నిర్వహణ ఆలస్యం అయింది.
అయితే ఎట్టకేలకు 7ఫేజ్‌లలో దేశ వ్యాప్తంగా అధికారులు ఈ ఉద్యోగాల భరీకి సీబీటీ-1ను నిర్వహించారు. సీబీటీ పూర్తైన అనంతరం తాజాగా ప్రాథమిక ‘కీ’ కూడా అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చారు. అంతేకాకుండా అభ్యంతరాలను కూడా స్వీకరించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిశితంగా పరిశీలించిన అధికారులు ఫైనల్ ‘కీ’ని సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 5న సీబీటీ-1కు సంబంధించిన తుది ‘కీ’ని ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ నెల 6-10ల మధ్య సీబీటీ ఫేజ్ -1కు సంబంధించిన పరీక్ష ఫలితాలను కూడా ప్రకటించనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: పరిమితికి లోబడే అప్పులు.. సంక్షోభంలోనూ సంక్షేమం: ఆర్థిక మంత్రి బుగ్గన