ఐపీఎల్ 2024లో రాజస్థాన్ వరుస విజయాలతో జోరు కనిపిస్తోంది. ఇవ్వాల ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ సొంత మైదానం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబైని చిత్తుగా ఓడించింది… పాయింట్స్ టేబుల్లో మరోసారి టాప్‌లో నిలిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ (125)ను తక్కువ పరుగులకే పరిమితం చేసిన రాజస్థాన్… ఛేదనలో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రియాన్ పరాగ్ హాఫ్ సెంచరీతో మరోసారి మెరిశాడు. దీంతో నిర్ధిష్ట లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఛేధించిన రాజస్థాన్.. ముంబైపై విజయం సాధించింది.
అయితే రాజస్థాన్ టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ.. మిడిలార్డర్ బ్యాటర్లు నిలకడగా ఆడుతూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10), జోస్ బట్లర్ (13), శాంసన్ (12) పేలవ ఫామ్‌తో నిరాశపరిచారు. రియాన్ పరాగ్ 54 (నాటౌట్)తో ఆకట్టుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ (16) ర్యాన్ పరాగ్ కు మద్దతుగా నిలిచి పరుగులు సాధించాడు. ఇక ముంబై బౌలర్లలో ఆకాష్ మధ్వల్ మూడు వికెట్లు తీయగా.. క్వేనా మఫాకా ఒక్క వికెట్ దక్కించుకుంది.