ఐపీఎల్ 2024 లో నేడు (సోమవారం) జరగనున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ – ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక రాజస్థాన్ హోం గ్రౌండ్ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది.
జట్ల వివరాలు :
ముంబై ఇండియన్స్ :
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, గెరాల్డ్ కోయెట్జీ, మహ్మద్ నబీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా.
రాజస్థాన్ రాయల్స్ :
యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (c & wk), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ.
జోరుమీదున్న రాజస్థాన్.. గెలుపే లక్ష్యంగా ముంబై
కాగా, ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఆడిన 7 మ్యాచ్‌లలో 6 విజయాలు సాధించింది పాయింట్స్ టేబుల్లో అగ్ర స్థానంలో నిలిచింది. మరోవైపు మూడు వరుస ఓటములతో సీజన్‌ను ప్రారంభించిన ముంబై ఇండియన్స్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలో ఉంది. దీంతో రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్ ముంబై జట్టుకు కీలకంగా మారింది.
వరుస విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌కు కూడా సమరోత్సాహంతో సిద్ధమైంది. సంజు శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, రొమన్ పొవెల్, హెట్మెయిర్, ధ్రువ్ జురెల్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక బౌల్ట్, అశ్విన్, అవేశ్ ఖాన్, యజువేంద్ర చాహల్ వంటి బౌలర్లు కూడా జట్టులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా రాజస్థాన్ విజయమే లక్షంగా బరిలోకి దిగుతోంది.
అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య జట్టును ముందుండి నడిపించలేక పోతున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. అయితే ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు ఫామ్‌లో ఉండడం ముంబైకి కాస్త ఊరటనిచ్చే అంశంగా మారింది. సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, షెఫర్డ్, నబి, తిలక్‌వర్మలతో ముంబై బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక బుమ్రా బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. కొయెట్జి, శ్రేయస్ గోపాల్, నబి కూడా పర్వాలేదనిపిస్తున్నారు.