జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. 20 ఓవర్లలో 193 పరుగులు చేసింది. ఇక, డిఫెండింగ్లోనూ అదరగొట్టిన గుజరాత్.. లక్నో జట్టును 173 పరుగులకే పరిమితం చేసి 20 పరుగుల తేడాతో మ్యాచ్ను సొంతం చేసుకుంది.
లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (58), నికోలస్ పూరన్ (64 నాటౌట్) అర్థ శతకాలతో చెలరేగినప్పటికీ విజయం సాధించలేకపోయారు. దీపక్ హుడా 26 పరుగులతో పరువాలేదనిపించాడు. ఇక రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీయగా.. నాండ్రే బర్గర్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (82 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. రియాన్ పరాగ్(43) సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. ఇక చివర్లో ధ్రువ్ జురెల్ (20 నాటౌట్) తో మెప్పించాడు. దాంతో, రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 స్కోర్ చేయగలిగింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు, మొహ్సిన్ ఖాన్ ఒక వికెట్ తీశారు.