Monday, November 25, 2024

RR vs DC | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ..

ఐపీఎల్ 2024 లో భాగంగా (గురువారం) మరి కొద్ది సేపట్లో జరగనున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ‌– ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో హోమ్ గ్రౌండ్ జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు మొదట బ్యాటింగ్ తో బరిలోకి దగినుంది.

జ‌ట్ల వివ‌రాలు..

ఢిల్లీ క్యాపిటల్స్ :

మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, రికీ భుయ్, రిషబ్ పంత్ (c & wk), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్.

రాజస్థాన్ రాయల్స్ :

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (c & wk), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.

- Advertisement -

జట్టు మార్పులు

ఢిల్లీ క్యాపిటల్స్: షాయ్ హోప్ వెనుక నొప్పి.., ఇషాంత్ శర్మ చీలమండ గాయం కార‌ణంగా ఆట‌కు దూరం కాగా, వారి స్థానంలో అన్రిచ్ నార్ట్జే, ముఖేష్ కుమార్ జ‌ట్టులోకి వచ్చారు.

ఆత్మవిశ్వాసంతో రాజస్థాన్

కాగా, తొలి మ్యాచ్‌లో లక్నోను అలవోకగా ఓడించిన రాజస్థాన్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. కెప్టెన్ శాంసన్ ఫామ్‌లో ఉండడం రాజస్థాన్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. ఇటీవల కాలంలో యశస్వి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు ప్రపంచంలోని అత్యంత విధ్వంసక బ్యాటర్లలో ఒకరిగా పేరున్న బట్లర్, హెట్‌మెయిర్‌ల రూపంలో రాజస్థాన్‌కు పదునైన అస్త్రాలు ఉండనే ఉన్నాయి.

ఇక ట్రెంట్ బౌల్ట్, చాహల్, అవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్‌ల రూపంలో మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో బౌలర్లు సమష్టిగా రాణించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. దీంతో పాటు సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుండడం కూడా రాజస్థాన్‌కు అతి పెద్ద ఊరటనిచ్చే అంశమే.

ఢిల్లీ బోణీ కొట్టేనా..

ఇక ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఢిల్లీ ఓటమి పాలైంది. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా పంత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేక పోయాడు. దీంతో ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జట్టును ముందుకు నడిపించాలనే లక్షంతో ఉన్నాడు. డేవిడ్ వార్నర్, మిఛెల్ మార్ష్, షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్‌ల రూపంలో విధ్వంసక బ్యాటర్లు ఢిల్లీలో ఉన్నారు. ఇషాంత్ శర్మ, మార్ష్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఢిల్లీ కూడా భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement