Wednesday, September 25, 2024

RR | ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జాం..

శంకర్ పల్లి (ప్రభన్యూస్) : శంకర్ పల్లి మండలంలో చిన్నపాటి వర్షం కురిసినా ప్రధాన రహదారులు వర్షపు నీటితో నిండిపోతున్నాయి. రోడ్డుపై పడే వర్షపు నీరు కల్వర్టుల ద్వారా బయటకు వెళ్లే మార్గాలను మూసివేయడంతో ఈ అవస్థలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మీర్జాగూడ జన్వాడ పరిసర ప్రాంతాల్లో ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

శంకర్ పల్లి హైదరాబాద్ ప్రధాన రహదారిపై మిర్జాగూడ స్టేజీ దాటిన తర్వాత కొల్లూరు, ఇంద్రారెడ్డి నగర్ పరిసర ప్రాంతాల నుంచి వర్షం నీరు వచ్చి ప్రధాన రహదారిపై ప్రవాహంల ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. రోడ్డుపై ఉన్న నీటిని తొలగించేందుకు గ్రామస్తులు శ్రమించే పరిస్థితి నెలకొంది.

సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం : ఇరిగేషన్ ఏఈ రాధిక

మంగళవారం సాయంత్రం కూడా కురిసిన వర్షం వల్ల ఇబ్బంది ఏర్పడిందని…. కల్వర్టు పరిసరాలలో ఉన్న రైతులు తమ తమ పొలం పనుల కారణంగా కల్వర్టులలో మట్టి పేరుకు పోయిందని ఇరిగేషన్ ఏయి రాధిక తెలిపారు. మండల రెవెన్యూ అధికారుల సమన్వయంతో త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని, ముఖ్యంగా మండల రెవెన్యూ సర్వేయర్ లేకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోందని అమె అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement