Saturday, September 7, 2024

Royal Enfield Himalayan 450 | న‌యా ఫీచ‌ర్ల‌తో యూత్ ఫిదా!

ప్రముఖ మోటార్‌ సైకిల్‌ తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అడ్వెంచర్‌ మోటార్‌ సైకిల్‌ కొత్త హిమాలయన్‌ను విడుదల చేసింది. గోవాలో జరిగిన మోటోవెర్స్‌ ఈవెంట్‌లో దీన్ని తీసుకు వచ్చింది. ఈ బైక్‌ ధర 2.69 లక్షల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. ఇది లాంచింగ్‌ ఆఫర్‌ మాత్రమేనని, డిసెంబర్‌ 31 తరువాత ఈ బైక్‌ ధరలు పెరుగుతాయని తెలిపింది. కొత్త హిమాలయన్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది.

బేస్‌ వేరియంట్‌ను మౌంటెయిన్‌ పేరుతో తీసుకు వచ్చింది. ఇది కాజా బ్రౌన్‌ రంగులో లభిస్తుంది. మిడ్‌ మేరియంట్‌ను పాస్‌గా పిలుస్తారు. ఇది స్లేట్‌ హిమాలయన్‌ సాల్ట్‌, స్లేట్‌ హిమాలయన్‌ బ్లూ రంగులో లభిస్తుంది. దీని ధర 2.74 లక్షలుగా కంపెనీ తెలిపింది. టాప్‌ వేరియంట్‌ను పీక్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో క్యామెంట్‌ వైట్‌ ధర 2.79 లక్షలు, బ్లాక్‌ వేరియంట్‌ ధర 2.84 లక్షలుగా కంపెనీ పేర్కొంది.

- Advertisement -

ఈ బైక్‌ ఇంజిన్‌ విషయానికి వస్తే కొత్త హిమాలయన్‌ 451 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 40.02 బీహెచ్‌పీ పవర్‌ను, 40 ఎస్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ఉంది. ముందువైపు 21 అంగుళాల వీల్‌, వెనుక వైపు 17 అంగుళాల స్పోక్‌ వీల్స్‌తో వస్తోంది. బైక్‌ ముందు వైపు 320 ఎంఎం డిస్క్‌ బ్రేక్‌, వెనుక వైపు 270 ఎంఎం డిస్క్‌ అమర్చారు. డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌ను ఇందులో అమర్చారు.

ఈ బైక్‌లో అడ్జస్టబుల్‌ సీట్‌ ఉంది. ఎత్తు కావాల్సిన విధంగా 825 ఎంఎం నుంచి 845 ఎంఎం వరకు పెంచుకోవచ్చు. లోయర్‌ సీటును 805-825 ఎంఎం వరకు అడ్జెస్ట్‌ చేసుకోవచ్చు. బైక్‌లో 117 లీటర్ల ఇంధన సామర్ధ్యం కలిగిన మెటాలిక్‌ ట్యాంక్‌ను అమర్చారు. కొత్త హిమాలయన్‌లో టీఎఫ్‌టీ డ్యాష్‌ బోర్డును స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు. గూగుల్‌తో కలిసి నావిగేషన్‌ను అభివృద్ధి చేశారు. బైక్‌ మొత్తం ఎల్‌ఈడీ లైటింగ్‌తో వస్తుంది. ఈ బైక్‌ టాప్‌ స్పీడ్‌ గంటకు 150 కి.మీటర్లు. లీటర్‌కు 28 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. ఈ బైక్‌ బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement