Thursday, November 21, 2024

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌లు.. విభిన్నమైన బైక్‌లు తీసుకు వస్తున్నామన్న కంపెనీ

రాయల్‌ ఎన్‌ఫీల్ట్‌ దేశంలో విభిన్నమైన విద్యుత్‌ బైక్‌లను తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. పలు మోడల్స్‌లో వీటిని అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే వీటికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని కంపెనీ ఇండియా సీఈఓ బి.గోవిందరాజన్‌ తెలిపారు. ఎలక్ట్రిక్‌ బైక్‌ల తయారీకి అనుగుణంగా చెన్నయ్‌ ప్లాంట్‌లో తగిన మార్పులు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్లాంట్‌ నుంచే మార్కెట్‌లోకి తీసుకు రానున్న విద్యుత్‌ బైక్‌లను తయారు చేయనుంది. విద్యుత్‌ వాహనాల తయారీ, సహా వివిధ మోడళ్లను అభివృద్ధి కోసం ఈ ఏడాది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 1000 కోట్ల రూపాయల మూలధనాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నిధుల్లో కొంత భగాన్ని పెట్రోల్‌ తో నడిచే మోటర్‌ సైకిళ్ల అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నారు. ఈవీ బైక్‌లను అభివృద్ధి చేసేందుకు కంపెనీ సమర్ధవంతమైన బృందాన్ని ఏర్పాటు చేసిందని గోవిందరాజన్‌ వెల్లడించారు. కంపెనీ ఇప్పటికే పలు విద్యుత్‌ బైక్‌ల మోడల్స్‌ను సిద్ధం చేసిందని, వీటిని టెస్టింగ్‌ చేసే పనులు జరుగుతున్నాయని తెలిపారు. కంపెనీ త్వరలోనే రాయల్‌ ఎన్‌ఫీల్ట్‌ విద్యుత్‌ బైక్‌లను మార్కెట్‌లో విడుదల చేయనుందని చెప్పారు. కంపెనీ బ్రాండ్‌కు తగిన విధంగానే వీటిని రూపొందిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్‌ బైక్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement