మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్.. 2022లో 350 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో నాలుగు కొత్త బైక్‌లను విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రతీ త్రైమాసికానికి ఓ కొత్త మోడల్ లాంచ్ చేయనుంది. ప్రస్తుతం స్క్రమ్ 411, హంటర్ 350 సీసీ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. స్క్రమ్ 411 ఫిబ్రవరిలో, హంటర్ 350 వచ్చే ఏడాది మధ్యలో భారత్ మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. హంటర్ 350 టీజర్‌ను విడుదల చేసింది. ఇది సింగిల్ సీట్‌తో ఉంటుంది. మెటోర్ 350ని పోలి ఉంటుంది. ఇంజిన్ సామర్థ్యం కూడా అంతే ఉంటుంది.
కొత్త జే-ప్లాట్‌ఫాం ఆధారంగా.. హంటర్ 350 349 సీసీ ఇంజిన్‌తో అందించబడుతుంది. ఇది గరిష్టంగా 22 బీహెచ్‌పీ పవర్, 26 ఎంఎం టార్క్‌ను పొందుతుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ దీని సొంతం. స్క్రమ్ 411.. హిమాలయన్ మోడల్‌గా ఉండనుంది. ఆర్‌ఈ స్క్రామ్ 411 ముందు భాగంలో పొడవైన విండ్ స్క్రీన్, స్ప్లిట్ సీట్లు, స్టాండర్డ్ లగేజ్ ర్యాక్, పెద్ద ఫ్రంట్ వీల్‌కు బదులు చిన్న చక్రాలు, తక్కువ సస్పెన్షన్, సింగిల్ సీట్, వెనుక పిల్లర్ గ్రాబ్ హ్యాండిల్ ఉంటుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తున్న వీటి ధరలు ఇంకా ప్రకటించలేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital