ప్రభుత్వరంగ సంస్థల (పిఎస్‌యులు) వాణిజ్య వివాదాల పరిష్కారానికి పరిపాలనా యంత్రాంగం (ఎఎంఆర్‌సిడి), కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్) ఎంవోయులకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం రేపటి నుంచి రెండు రోజులపాటు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల (సిపిఎస్‌ఈలు) మద్దతుతో, స్కోప్ సహకారంతో పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ విభాగం ఈ సదస్సును నిర్వహిస్తోంది.
రౌండ్ టేబుల్, ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. సిపిఎస్‌ఈల సీనియర్ అధికారులు, అమలుచేసే ఏజెన్సీలు, వాటాదారుల మంత్రిత్వశాఖలు, ఆకాంక్షాత్మక జిల్లాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. సామాజిక నిబద్ధత, వివాద పరిష్కారాలు, సీపీఎస్‌ఈల పనితీరు మెరుగు పరచడానికి వాటాదారుల చర్చలను రూపొందించడం ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్యోద్దేశం.
రౌండ్ టేబుల్ సందర్భంగా, ప్రగతి మైదాన్‌లో సిఎస్‌ఆర్ స్టోరీ: సిపిఎస్‌ఈలు, ఇంప్లిమెంట్‌ంగ్ ఏజెనీలు పేరుతో ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది. ప్రజారోగ్యం, పౌష్టికాహారం, విద్య, క్రీడలు తదితర అంశాల్లో సిఎస్‌ఆర్ కార్యకలాపాల ద్వారా సీపీఎస్‌ఈలు అందించిన సహకారాన్ని వివరించేలా ఈ ప్రదర్శన ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ నేడు, రేపు సందర్శకులకు ఆహ్వానం పలుకుతోంది.