న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలోని వాహన సౌకర్యం లేని ఆధ్యాత్మిక క్షేత్రాలకు రోప్వేలు ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తగిన డిజైన్లతో ముందుకు రావాలని కన్సల్టెంట్లను ఆహ్వానించింది. రోప్ వేల ప్రాజెక్టులకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించింది.
దేశ వ్యాప్తంగా 18 క్షేత్రాల్లో రోప్ వే లు
దేశంలోని 18 ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రోప్ వే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో శబరిమల లోని అయ్యప్ప ఆలయం కూడా ఉంది. పంబ నుంచి శబరిమల లోని సన్నిధానం వరకు 2.62 కిలోమీటర్ల పొడవున రోప్ వే నిర్మిస్తారు. జమ్మూ కశ్మీర్ లోని బాల్టాల్ నుంచి అమర్నాథ్ వరకు 11.6 కిలోమీటర్ల మేర రోప్ వే నిర్మిస్తారు.
- Advertisement -