బెంగుళూరు – కర్ణాటకలో హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ, ఐపీఎస్ అధికారిణి డీ రూప ముద్గల్ , దేవాదాయ శాఖ కమిషనర్, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది.. ఈ ఇద్దరు అధికారులు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఆరోపణలు కొనసాగిస్తుండటంతో . ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం ఆ ఇద్దరిని ప్రస్తుత ఉన్నశాఖల నుంచి బదిలీ చేసింది.. వారికి ఎటువంటి పోస్టింగ్ లు ఇవ్వకుండా జిఎడికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది.. అంతే కాకుండా ముద్గల్ భర్త ఐఎఎస్ అధికారి మునీష్ మౌద్గిల్ ప్రచార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తుండగా అతడిని సైతం బదిలీ చేసింది.. రోహిణి సింధూరి ప్రస్తుతం రాష్ట్ర ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. ఆ స్థానంలో ఐఏఎస్ అధికారి హెచ్ బసవరాజేంద్రను నియమించింది. మరోవైపు రూప.. కర్ణాటక హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా రూప ముద్గల్ పని చేస్తుండగా ఆ స్థానంలో ఐఏఎస్ అధికారిణి డి భారతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement