తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ వర్షాల కారణంగా నిర్మల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఉన్న తహసీల్దార్ ఆఫీసు భవనం పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. భవనం పైకప్పు కూలి పోతున్న సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే భవనం పరిస్థితిపై గత కొంతకాలంగా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భవనం పైకప్పు కూలిపోతున్న సమయం లో పెద్ద శబ్ధం రావడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement