ఫిఫా ప్రపంచకప్ తర్వాత మరో ఆసక్తికరమైన పోరు ఫుట్‌బాల్ అభిమానులను అలరించనుంది. అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ, పోర్చుగల్ స్ప్రక్టర్ క్రిస్టియానో రొనాల్డో ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో తలపడనున్నారు. జనవరి 19న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సౌదీ అరేబియాలోని కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానుంది. ఈ స్టేడియం సామర్ధ్యం 68 వేల మంది మాత్రమే. అయితే ఈ స్టార్ ఆటగాళ్ల పోరును మైదానంలో చూసేందుకు లక్షలాది మంది అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత రొనాల్డో , మెస్సీ మైదానంలో పడుతుండటంతో టికెట్లు కావాలంటూ 20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
జనవరి 19న సౌదీ అరేబియా క్లబ్ అల్ నస్రీ తరపున రొనాల్డో తొలి మ్యాచ్ ఆడనున్నాడు. మెస్సీ కెప్టెన్సీలోని పీఎస్‌జీ క్లబ్, మెస్సీ నాయకత్వంలోని బార్సిలోనాను 3-0తో ఓడించింది. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీ గోల్స్ కొట్టి అర్జెంటీనాను విజేతగా నిలిపాడు. కానీ రొనాల్డో మాత్రం బెంచ్‌కే పరిమితమయ్యాడు. అంతే కాదు మాంచెస్టర్ క్లబ్ అతనితో కాంట్రాక్ట్ రద్దు చేసుకుంది. సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్రీ క్లబ్ రొనాల్డోను భారీ ధరకు సొంతం చేసుకుంది. 2025 వరకు ఈ స్టార్ ప్లేయర్ ఆ క్లబ్‌తో కొనసాగనున్నాడు.