Friday, January 10, 2025

TG | దేశాభివృద్ధిలో ఓవర్సీస్ భార‌తీయుల పాత్ర కీలకం : సీఎం రేవంత్

ప్రవాస భారతీయుల దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉంటోన్న భారతీయులందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధిలో ఓవర్సీస్‌ ఇండియన్‌ కమ్యూనిటీ పోషిస్తున్న పాత్ర ఎంతో ముఖ్యమైనదని, తెలంగాణ రైజింగ్‌ కార్యాచరణలోనూ ఎన్నారైల భాగస్వామ్యం ఆవశ్యకమని సీఎం రేవంత్‌ ఒక సందేశంలో పేర్కొన్నారు.

మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా గొప్ప పేరు పొందిన తర్వాత స్వజనుల సేవ కోసం, స్వరాజ్య సాధనలో భాగం కావడానికి 1915, జనవరి 9న ముంబైకి తిరిగి వచ్చిన సందర్భానికి గుర్తుగా ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని గుర్తుచేశారు.

ప్రవాసుల పెట్టుబడులు, ఆలోచనలకు తెలంగాణ చక్కటి వేదికగా ఉండటమే కాదు, ప్రవాసీ ప్రజావాణి లాంటి వినూత్న కార్యక్రమాలతో గల్ఫ్‌, ఇతర దేశాల్లోని కార్మికుల సంక్షేమానికి కూడా ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement