కొన్ని సినిమాల్లోని పాత్రలకోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది..గంటలకొద్ది మేకప్ తో ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాగా విలక్షణ నటుడు ఆర్ మాధవన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాకెట్రీ. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు. వర్గేసే మూలన్ నిర్మించిన చిత్రమిది. ఇస్రో సైంటిస్ట్, మాజీ డైరెక్టర్ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నంబి పాత్రలో మాధవన్ నటిస్తూ రూపొందించారు. జులై 1న ఆరు భాషల్లో విడుదల ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ షురూ చేశారు. మాధవన్ తన టీమ్‌తో కలిసి ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల కేరళా ప్రమోషన్‌లో పాల్గొన్నారు. మరోవైపు రియల్ సైంటిస్ట్ నంబి నారాయణన్‌తో కలిసి ఓ స్పెషల్ వీడియోని రూపొందించారు. ఇందులో మాధవన్.. నంబి నారాయణన్ లా కనిపించేలా మేకప్ వేసుకుని అసలు రియల్ నంబి ఎవరు అనేంతగా అచ్చుగుద్దినట్టుగా రెడీ అయ్యారు.
నంబి గెటప్‌లో మాధవన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయి షాకిస్తున్నారు. ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఇద్దరిలో రియల్ నంబి ఎవరు అంటూ ప్రశ్నలు వేసుకోవడం, సమాధానం చెప్పాలని అనడం వంటి సరదాగా సాగే వీడియో వైరల్ అవుతుంది. దీంతోపాటు తాజాగా మరో వీడియోని షేర్ చేశారు ఆర్ మాధవన్. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆయన అభిమానులతో పంచుకున్నారు. రియల్ నంబిగా మారడానికి ఎంతగా కష్టపడ్డాడో తెలియజేశారు. దాదాపు 18 గంటలపాటు మేకప్ వేసుకోవడం కోసం కూర్చున్నట్టు తెలిపారు. ఇది ఎంతటి సిల్లి, స్టుపిడ్ థింగ్ అంటూనే తాను ఎంత కష్టపడ్డాడో తెలిపారు. వైట్ జుట్టూ, గెడ్డంతో రియల్ నంబిలానే కనిపిస్తున్నారు మాధవన్. ప్రస్తుతం ఆ విషయాన్ని తెలియజేస్తూ ఆయన పంచుకున్న ఈ వీడియో క్లిప్ ఆద్యంతం ఆకట్టుకుంటూ వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం మాధవన్ ప్రాణం పెట్టారని, పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని అర్థమవుతోంది ఈ వీడియో చూస్తే.