Tuesday, November 26, 2024

Record | 300 సిక్సులతో రోహిత్ సరికొత్త రికార్డ్.. టాప్ 5లో భారత్ నుంచి ఇద్దరు

వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఇవ్వాల‌ అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌తో జరిగిన‌ 2023 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయిని చేరుకున్నాడు. ఈమ్యాచ్‌లో మెత్తం 6-ఫోర్లు, 6-సిక్సుల‌తో 86 ప‌రుగులు చేసిన హిట్ మ్యాన్.. 300 వన్డే సిక్సర్లు బాదిన మూడో బ్యాటర్‌గా రికార్డడుకెక్కాడు.

వన్డే క్రికెట్‌లో 351 సిక్సులతో పాకిస్థాన్ బ్యాటర్ షాహిద్ అఫ్రిది అగ్రస్థానంలో నిలిచాడు. 50 ఓవర్ల క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో అఫ్రిదీ తర్వాతి స్థానంలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఉన్నాడు.

ODI క్రికెట్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్లు వీరే..

  1. షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్) – సిక్స్‌లు: 351 , మ్యాచ్‌లు: 398, పరుగులు: 8064, అత్యధిక స్కోర్: 124, స్ట్రైక్ రేట్: 117.00
  2. క్రిస్ గేల్ (వెస్టిండీస్) -సిక్స్: 331 , మ్యాచ్‌లు: 301, పరుగులు: 10480, అత్యధిక స్కోర్: 215, స్ట్రైక్ రేట్: 81.19
  3. రోహిత్ శర్మ (భారతదేశం) – సిక్స్‌లు: 301* , మ్యాచ్‌లు: 254, పరుగులు: 10265, అత్యధిక స్కోర్: 264, స్ట్రైక్ రేట్: 91.01
  4. సనత్ జయసూర్య (శ్రీలంక) – సిక్స్‌లు: 270 , మ్యాచ్‌లు: 445, పరుగులు: 13430, అత్యధిక స్కోర్: 189, స్ట్రైక్ రేట్: 91.20
  5. ఎంఎస్ ధోని (భారతదేశం) – సిక్స్‌లు: 229 , మ్యాచ్‌లు: 350, పరుగులు: 10773, అత్యధిక స్కోర్: 183*, స్ట్రైక్ రేట్: 87.56.
Advertisement

తాజా వార్తలు

Advertisement