భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఎడమ బొటన వేలి గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మ.. ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో మరి కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని బీసీసీఐ వైద్య బృందం సూచించింది. దీంతో అతను రెండో టెస్టుకు దూరం కావల్సి వచ్చింది. బంగ్లాతో రెండో వన్డే మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ బొటన వేలుకు గాయం అయ్యింది. దీంతో మూడో వన్డేకు, తొలి టెస్టుకు రోహిత్ దూరమయ్యాడు.
రెండో టెస్టుకల్లా రోహిత్ శర్మ అందుబాటులో రానున్నాడని ప్రచారం జరిగింది. గాయం పూర్తిగా నయం కాకపోవడంతో రెండో టెస్టుకు దూర మయ్యాడు. రోహిత్ శర్మతో పాటు నవదీప్ సైనీ సైతం రెండో టెస్టుకు అందుబాటులో లేకుండాపోయారు. పొట్ట కండరాలు పట్టేయడంతో నవదీప్ సైనీ జట్టుకు దూరమయ్యాడు. ఇప్పటికీ కోలుకోకపోవడంతో అతన్ని రెండో టెస్టుకు జట్టులో కలవలేకపోయాడు.
బిసీసీఐ వెల్లడించిన జట్టు ఇదే
కెఎల్ రాహుల్ (కెప్టెన్), శుభమన్ గిల్, చటేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), కెఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.