హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. ఫిట్‌నెస్ పరీక్షలో పాస్ అయ్యాడు. బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో అన్ని విధాలుగా కోలుకున్నాడు. నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సిన రన్నింగ్‌తో పాటు ఇతరాత్ర వాటిలో కూడా రోహిత్ పాస్ అయ్యాడు. దీంతో రోహిత్ శర్మకు అధికారులు ఫిట్‌నెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇక గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో.. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌కు హిట్‌మ్యాన్ అందుబాటులోకి వస్తాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటన మొత్తానికి రోహిత్ శర్మ దూరం అయ్యాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతని తొడ కండరాలు పట్టేశాయి. గతంలో కూడా ఇదే తరహాలో రోహిత్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తరువాత కోలుకుని మ్యాచ్‌లు కూడా ఆడాడు.
సౌతాఫ్రికా పర్యటనకు సన్నద్ధం అవుతున్న సమయంలోనే మళ్లి ఇదే గాయం తిరగబడింది. దీంతో చివరి నిమిషంలో రోహిత్ దక్షిణాఫ్రికా పర్యటనకు దూరం అయ్యాడు. టెస్టు సిరీస్‌కు మాత్రమే దూరం అవుతాడని, వన్డే సిరీస్‌కల్లా కోలుకుంటాడని అందరూ భావించారు.. కానీ అప్పటికీ రోహిత్ కోలుకోలేదు. ఎన్‌సీఏ అకాడమీలో నెల రోజులు ఉన్నాడు. ఫిజియో థెరపీలు చికిత్స అందించారు. ఫిట్‌నెస్ కోసం గంటల తరబడి కష్టపడ్డాడు. బరువు కూడా తగ్గించుకున్నాడు. 6 కిలోల బరువు తగ్గిపోయాడు. ఈ ఫొటోలు కూడానెట్టింట్లో వైరల్‌గా మారాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..