Monday, November 25, 2024

బంగ్లాతో టెస్ట్‌ సిరీస్‌కు రోహిత్‌ దూరం?

బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌లో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు దూరమయ్యే ఆడడం అనుమానాస్పదంగా మారింది. రెండో వన్డేలో రోహిత్‌ ఎడమ చేతి బొటనవేలికి గాయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫీల్డింగ్‌ చేయలేదు. కెప్టెన్‌ బాధ్యతను కెఎల్‌ రాహుల్‌ స్వీకరించాడు. అయితే బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ శర్మ క్రీజులోకి వచ్చి సెంచరీ సాధించాడు. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడినా మ్యాచ్‌లో భారత్‌ విజయాన్ని సాధించలేకపోయింది. మ్యాచ్‌ అనంతరం కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాట్లాడుతూ నిపుణుల సలహాలు తీసుకునేందుకు రోహిత్‌ శర్మ స్వదేశానికి తిరిగి వెళ్లనున్నట్లు తెలిపాడు. హిట్‌ మ్యాన్‌ రోహిత్‌తో పాటు గాయం కారణంగా దీపక్‌ చాహర్‌, కుల్దిప్‌ సేన్‌ సైతం మూడో వన్డేకి దూరమయ్యారని ద్రవిడ్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ శర్మ మాట్లాడాడు. ‘బొటనవేలికి అయిన గాయం అంత పెద్దదేం కాదు. అదృష్ట వశాత్తు ఎలాంటి ఫ్రాక్చర్‌ కాలేదు. కాబట్టి బ్యాటింగ్‌ చేయగలిగాను’ అని చెప్పాడు. ఈ నెల 14నుంచి బంగ్లాతో టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో రోహిత్‌ ఆడగలడా? లేదా? అన్నది తనకు తెలియదని ద్రవిడ్‌ పేర్కొన్నారు. మూడో వన్డేకు రోహిత్‌ , కుల్‌దీప్‌, దీపక్‌లు మూడో వన్డేకు దూరమయ్యారన్న ద్రవిడ్‌ రోహిత్‌ ముంబై వెళ్లి స్పెషలిస్ట్‌ వైద్యులను సంప్రదిస్తాడని తెలిపారు.

ఈ పరిస్థితిలో టెస్ట్‌ సిరీస్‌ ఆడతాడో లేదో చెప్పే పరిస్థితుల్లో లేమని చెప్పాడు. గాయం తీవ్రమైతే కోలుకునేందుకు మూడు నాలుగు వారాల సమయం పడుతుంది. బంగ్లాతో జరిగిన రెండో వన్డే రెండో ఓవర్‌లో రోహిత్‌ శర్మ గాయపడ్డాడు. మహమ్మద్‌ సిరాజ్‌ వేసిన బంతిని అనాముల్‌ హక్‌ బ్యాట్‌ కు తగిలి బంతి స్లిప్‌లోకి వెళ్లింది. స్లిప్‌లో ఉన్న రోహిత్‌ శర్మ చేతికి తగిలి క్రిందపడింది. ఆ తర్వాత రోహిత్‌ నొప్పితో బాధపడడం కనిపించింది.

మూడోసారి గాయపడ్డ చాహర్‌

- Advertisement -

మరో వైపు రెండో వన్డేలో బౌలర్‌ దీపక్‌ చాహర్‌ సైతం గాయపడ్డాడు. తన కోటా బౌలింగ్‌లో కేవలం మూడు ఓవర్లను మాత్రమే వేయగలిగాడు. గత నాలుగు నెలల్లో చాహర్‌ గాయపడడం ఇది మూడోసారి. అతను స్నాయువు, వెన్ను నొప్పి కారణంగా దాదాపు ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. గాయం కారణంగా ఐపిఎల్‌లో ఆడలేకపోయాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత జట్టులోకి తిరిగి చేరాడు. జింబాబ్వేతో సిరీస్‌కు ఎంపికగా ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ కు దూరమయ్యాడు. అలాగే వెన్ను సమస్యల కారణంగా టీ 20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement