Friday, November 22, 2024

ఫేస్‌బుక్‌కు రోహింగ్యాల షాక్‌.. రూ.10లక్షల కోట్లు పరిహారం కోరుతూ కేసు

యూఎస్‌: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు రోహింగ్యా శరణార్థులు షాక్‌ ఇచ్చారు. ఫేస్‌బుక్‌ పూర్వరూపం మెటా కంపెనీపై 150మిలియన్‌ డాలర్ల భారీ నష్టపరిహారం కోరుతూ దావా వేశారు. యూకే, యూఎస్‌లో రోహింగ్యా శరణార్థులు ఫేస్‌బుక్‌కు వ్యతిరేకంగా కేసు వేశారు. మయన్మార్‌లో తమకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రచారం ఫేస్‌బుక్‌ వేదికగా జరిగిందని వారు ఆరోపించారు. తమవర్గానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించడంలో ఎఫ్‌బీ కీలకపాత్ర పోషించిదని, తమపై వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఫేస్‌బుక్‌ విఫలమైదని రోహింగ్యాలు పేర్కొన్నారు.

నష్టపరిహారం కింద మెటా కంపెనీ 150మిలియన్‌ డాలర్లు (రూ.10లక్షల కోట్లు) పరిహారం చెల్లించాలని కోరారు. ఈ మేరకు యూకేకు చెందిన లీగల్‌ కంపెనీలు ఎడెల్‌సన్‌ పీసీ, ఫీల్డ్స్‌ పీఎల్‌ఎల్‌సీలు ఫేస్‌బుక్‌కు వ్యతిరేకంగా శాన్‌ఫ్రాన్సిస్కో న్యాయస్థానంలో కేసు దాఖలు చేశాయి. 2013లో రోహింగ్యాలకు వ్యతిరేకంగా ప్రచారమైన కొన్ని ఎఫ్‌బీ ప్రచారాలను కోర్టుకు సమర్పించారు. అదేవిధంగా లండన్‌లో ఫేస్‌బుక్‌ కార్యాలయానికి నోటీసులు అందజేశారు. మయన్మార్‌లో 2017 ఆగస్టులో చెలరేగిన హింస కారణంగా ఏడున్నరలక్షల మంది రోహింగ్యాలు దేశం విడిచి శరణార్థులుగా పలు దేశాలకు పారిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement