దిగ్గజ శాస్త్రవేత్త నంబి నారాయణన్ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ . నంబి నారాయణన్ పాత్రలో హీరో మాధవన్ నటించి.. ఆయనే స్వయంగా దర్శకత్వం వహించారు. జులై 1న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. నంబి నారాయణన్ భార్య పాత్రలో సీనియర్ నటి సిమ్రాన్ నటించారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. తమిళ స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో కనిపించారు. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్‌డేట్ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 26 నుంచి రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్ మూవీ స్ట్రీమింగ్ అవుతున్నట్లు అఫిసీయల్ ప్రకటన వచ్చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. థియేటర్ల వద్ద కాసులు బాగానే రాబట్టుకుంది. రూ.40 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.