మైకోలైవ్‌లో ఆదివారం ఉదయం నుంచి నిరంతరం రాకెట్ దాడులు జరిగాయని ఆ ప్రాంత గవర్నర్ విటాలి కిమ్ తెలిపారు. విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వివిధ రకాల క్షిపణులతో రష్యన్లు పవర్‌గ్రిడ్లు, ఇళ్లు, క్రీడా మైదానాలపై బాంబులు వేస్తున్నారని మైకోలైవ్ సైనిక ప్రతినిధి చెప్పారు. మైకోలైవ్ అనేది ఉక్రెయిన్ మిలటరీకి వ్యూహాత్మక ఓడరేవు నగరం. ఒడెసాతో సహా ఉక్రెయిన్ ఆగ్నేయ మూలను స్వాధీనం చేసుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్న రష్యన్ బలగాలను అడ్డుకుంటున్నామని పేర్కొన్నారు.
మరొకవైపు ఖార్కివ్‌లో జరిగిన షెల్లింగ్‌లో ఐదుగురు మరణించారు. 13 మంది గాయపడ్డారు. నగరంలో వరుస బాంబు దాడుల శబ్దాలు వినిపించాయి. అగ్నిమాపక యంత్రాలు భవనాల్లో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పేలుడు ధాటికి రోడ్లన్నీ చెత్తతో నిండిపోయాయి అని అధికారులు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..