Tuesday, November 26, 2024

వ్యభిచారం ముగుసులో దోపీడీ.. ముగ్గురు కిలాడీ లేడీల అరెస్ట్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వ్యభిచారం మునుగులో దోపీడీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను మామునూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరిలో మరొ నిందితుడు పరారీలో వున్నాడు. వీరి నుండి పోలీసులు 8,400 రూపాయల నగదు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి ఈస్ట్రన్ డిసిపి వెంకటలక్ష్మీ వివరాలు వెల్ల‌డించారు. పరారీలో వున్న నిందితుడు వరంగల్ జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన విజయకుమార్‌తో పాటు.. పర్వతగిరి ప్రాంతానికి చెందిన రాయపురం సరిత, కేసముద్రం ప్రాంతానికి చెందిన కోడం స్వరూప, నూనె స్వప్నతో కలిసి ఒక ముఠాగా ఏర్పాడ్డారు. ఈజీగా డబ్బు సంపాదించాలకున్నారు.

ఇందులో భాగంగా ఈ ముఠాలో ముగ్గురు ఆడాళ్లు బస్ స్టేషన్లో అమాయకులైన యువకులను సైగలతో ఆకర్షించి, వారిని ప్రలోభపెట్టి ఒక వెహికల్ ని కిరాయికి తీసుకొని వారితోపాటు సదరు విటుడుని కూడా ఎక్కించుకొని వరంగల్ సిటీ పరిసర గ్రామాలు, నిర్మానుష్యమైన ప్రాంతాలకు తీసుకు వెళ్తున్న సమయంలో ఆ ముఠాలోని మహిళలకు విజయ్ కుమార్ కు ఫోన్ ద్వారా రహస్యంగా సమాచారం చేరవేస్తారు. సమాచారం అందుకున్న నిందితుడు విజయ్ కిలాడీ లేడీలున్న ప్రాంతానికి చేరుకోని వారితో వున్న యువకులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు.

ఈ విధంగా ఈ ముఠాపై మామునూరు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండు కేసులలో 20 వేల రూపాయల నగదు ఒక సెల్ ఫోను దోపిడికి గుర‌య్యాయి. గీసుకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని ధర్మారం గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర నుంచి 3000 నగదు, 2000 రూపాయల విలువగ‌ల‌ ఫోన్ ను లాక్కున్నారు. కాగా నమ్మదగిన సమాచారంతో మామునూరు సిఐ క్రాంతి కుమార్, తన సిబ్బందితో ముగ్గురు మ‌హిళ‌ల‌ను రాంగోపాలపురం వద్ద అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement