కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ మానిటైజేషన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తమ లక్ష్యాలను విపులంగా వివరించారు. 6 కోట్ల లక్షల రూపాయల సమీకరణ లక్ష్యంగా జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగాల్లో నిధుల సమీకరనే లక్ష్యంగా జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ పని చేస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగాల ఆస్తుల అమ్మకంతో ఏకంగా ఆరు లక్షల కోట్ల రూపాయలను సమీకరించిన వచ్చని ఆమె వెల్లడించారు. నిర్దిష్ట కాలానికి ఆస్తుల అమ్మకం ద్వారా నిధులను సమీకరించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఆస్తుల యజమాన్య హక్కులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయని స్పష్టం చేశారు.
ఈ వార్త కూడా చదవండి: ఏపీలో టెన్త్ పాసైన విద్యార్ధులకు మైగ్రేషన్ సర్టిఫికేట్