Sunday, November 17, 2024

రోడ్డు మరమ్మతులు చేపట్టారు.. గుంతలు పూడ్చడం మరిచారు..!

బుచ్చిరెడ్డిపాలెం : బుచ్చిరెడ్డిపాలెం జొన్నవాడ నెల్లూరు రోడ్డు మరమ్మతులకు గురి కావడంతో కాంట్రాక్టర్లు అధికారులు మరమ్మతులు చేపట్టారు. లక్షల రూపాయలు నిధులు కేటాయించిన నాసిరకంగా మరమ్మతులు చేస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. ఆరు కిలో మీటర్ల మేర ఉన్న ఈ రోడ్డులో ఎక్కడ చూసినా పెద్దపెద్ద గుంటలు తయారయ్యాయి. గడిచిన మూడు సంవత్సరాలుగా మరమ్మతులు జరగకపోవడంతో స్థానికులు, వాహనదారులు అనేక ప్రమాదాలు బారిన పడ్డారు. రోడ్డు ప్రమాదాలు జరిగి రక్తసిక్తమై కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో ఆర్ అండ్ బీ అధికారులు రోడ్డు మరమ్మతులకు నిధులు కేటాయించారు. మరమ్మతులు చేసేందుకు కాంట్రాక్టర్ కు అనుమతివ్వడంతో వారు నాసిరకమైన కంకర తారుతో మరమ్మతులు చేపట్టారు. కొద్దిరోజులుగా ఈ మరమ్మతులు కొనసాగుతున్న రోడ్లు గుంటలు పూడ్చిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. నాసిరకమైన కంకర కారు వాడడంతో రోడ్డు వేసిన మనసుటి రోజే గుంటలు ఏర్పడుతున్నాయి. రోడ్డు వేసేటప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తుతో ఉండడంతో మరమ్మత్తుల సమయంలో ముఖం చాటేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు బుచ్చిరెడ్డిపాలెం జొన్నవాడ నెల్లూరు రోడ్డు మరమ్మతులపై విచారణ జరిపి అక్రమాలు జరిగి ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement