షిర్డీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న తుఫాన్ వాహనం.. అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలతో పాటు ఆరు నెలల చిన్నారి ఉంది.
అయితే మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. వీరంతా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప వాసులుగా గుర్తించారు. ఈ ఘటనతో కొండగడపలో తీవ్ర విషాదం అలుముకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. దేవుడి దర్శనానికి వెళ్లిన వారు విగతజీవులుగా మారడం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.