మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబయి – ఆగ్రా హైవేపై ఆర్టీసీ బస్సును ఇవాళ ఉదయం ట్రక్కు ఢీకొట్టింది.
దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఈరోజు ఉదయం ముంబయి – ఆగ్రా జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, ట్రక్కు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది స్పాట్ డెడ్ అయ్యారు వారి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం. కేసు నమోదు చేసుకుని ఘటనకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. ప్రస్తుతం మృతదేహాలను ఆస్పత్రికి తరలించాం.’ అని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు.