ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బ్యాడ్మింటన్ ఆడుతున్న వీడియోను ఆయన కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొద్దిసేపు మాత్రమే ఉన్న సదరు వీడియోలో నేపథ్యంలో పాత హిందీ సినిమా పాట వినపడుతుండగా లాలూ ప్రసాద్ యాదవ్ చిరునవ్వులు చిందిస్తూ బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. ”భయమన్నది తెలియదు.. తలవంచడం నేర్చుకోలేదు.. పోరాడారు. ఇంకా పోరాడుతారు. జైలుకు భయపడరు.. అంతిమంగా విజయం సాధిస్తారు” అనే వ్యాఖ్యను సదరు వీడియోకు తేజస్వీ యాదవ్ జోడించారు. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న 75 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూత్రపిండం దానం చేయడానికి ఆయన కుమార్తె రోహిణి ముందుకు రావడంతో గతేడాది డిసెంబర్ ఐదవ తేదీన సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో లాలూ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశానికి ఆయన తిరిగి వచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement