ఐపీఎల్ 2024లో భాగంగా ఇవ్వాల జరుగుతన్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్… ఢిల్లీ ముందు భారీ టార్గెట్‌ను సెట్ చేసింది. సొంత మైదనాంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడగా.. ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆకరి ఓవర్లలో రియాన్ పరాజ్ చెలరేగి ఆడగా.. రాజస్థాన్ స్కోర్ భారీగా వెల్లింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగలిగింది.
రాజస్థాన్ టాపార్డర్ బ్యాటర్లు యశస్వీ జైస్వాల్ (5), జోస్ బట్లర్ (11), కెప్టెన్ సంజూ శాంసన్(15)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. ఈ దశలో రియాన్ పరాగ్ (84) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఇక అశ్విన్ (29), ధృవ్ జురెల్ (20), హెట్మెయర్ (14) పరుగులతో పరువాలేదనిపించారు.
ఇక ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, అన్రిచ్ నోర్ట్జే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఓక్కో వికెట్ దక్కించుకోగా.. 186 పరుగుల టార్గెట్ తో ఢిల్లీ క్యాపిటల్స్ చేజింగ్ కు దిగనుంది.