ప్రభన్యూస్ : వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాలలో గత రెండు రోజులుగా కురుస్తున్న బారీగా వర్షం కారణంగా.. వాగులు వంకలు నిండుగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు పక్కన గల పంట పొలాలలోకి నీరు చేరటంతో రైతాంగం ఇబ్బందులు పాలవుతున్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివసాగర్ చెరువు, కొంపల్లి చెరువు, మండలలోని సర్పన్ పల్లి ప్రాజెక్ట్, కోట్ పల్లి ప్రాజెక్ట్ పూర్తిగా నిండి నిండుకుండలా కనిపిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టులను వీక్షించేందుకు పర్యటకులు పోటెత్తున్నారు. ఇక గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి వాగులలో నీటి ప్రవాహం బాగా పెరిగింది.. ఈ కారణంగా రైతులు తమ పొలాలలోకి వెల్లేందుకు జంకుతున్నారు.
ఇటీవల మోమిన్ పేట మండలం టేకుల పల్లి వద్ద వాగులో కొట్టుకుపోయిన అంజయ్య అనే రైతు మృతి చెందారు. జిల్లాలోని అన్ని మండలాలలో సాధారణ వర్షపాతం కంటే అదనంగా 50 శాతం వర్షం కురిసినట్లు సమాచారం. ఇదే వర్శాలు కొనసాగితే పంటలు పండటం కష్టమని ఇటు అధికారులు, రైతులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికైనా వర్షాలు తగ్గి ఎండలు కోడితే తప్ప భూములు ఆరిపోయే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.