Tuesday, November 19, 2024

ఎండిపోతున్న థేమ్స్‌ నది.. ఇంగ్లండ్‌లో గ‌డ్డు ప‌రిస్థితులు

ఒక నాడు రవి అస్తమించని ఆంగ్ల సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటన్‌ రాజధాని లండన్‌ ఇప్పుడు నీటి కొరతను ఎదుర్కొంటోందిన. ఇంగ్లాండ్‌కి ప్రధాన నీటి వనరు అయిన థేమ్స్‌ నది క్రమంగా ఎండిపోతోంది. 1935 తర్వాత ఇంతటి దుర్భిక్షాన్ని ఎన్నడూ ఎదుర్కోలేదని వయోవృద్ధులు చెబుతున్నారు. ఇంగ్లాండ్‌లో వర్షపాతం సాధారణ స్థితి కన్నా దారుణంగా పడిపోయిందనీ, నెలకు 35 శాతం పైగా వర్షపాతం నమోదు కావల్సిఉండగా, జూలై లో 23.1 శాతం మాత్రమే నమోదు అయినట్టు అధికారులు తెలియజేశా రు. ఇంగ్లాండ్‌ అంతటా ఎండలు మండిపోతున్నాయి. గుక్కెడు మంచినీరు దొరకడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement