Monday, November 18, 2024

పెరుగుతున్న పులుల సంచారం.. మేతకు వెళ్తున్న పశువులు బ‌లి..

నెల రోజులుగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్ద పులులు సమీప అటవీ గ్రామాల ప్రజలను హడలెతిస్తున్నాయి. కొద్ది నెలలుగా కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో పులుల సంచారం పెరిగింది. రోజూ ఏదో ఒక చోట పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయి. అడవిలోకి మేతకు వెళ్తున్న పశువులను పులులు చంపుతున్నాయి. దీంతో అడవులన్నీ జల్లెడ పట్టిన అటవీ సిబ్బంది ట్రాకింగ్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. పశువులను పులి హతమార్చడం దృశ్యాలు ట్రాక్కింగ్‌ కెమెరాలో చిక్కింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మహదేవపూర్‌ మండలం కెనాల్‌ ర్యాంప్‌ వద్ద ఒక పెద్దపులి సంచరించినట్లు పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు.

ప్రస్తుతం కాళేశ్వరం పరిసర అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఈ పులి గడిచిన మూడునాలుగు రోజుల్లో నాలుగు పశువులను పొట్టన పెట్టుకుంది. గత వారంలో పోలారం, మహబూబాపల్లిలో సంచిరించి, తర్వాత మల్లరం అడ్డరోడ్డు పరిసరాల్లో సంచిరించినట్లు అటవీశాఖ సిబ్బంది ధృవీకరించారు. మహదేవపూర్‌ మండలం కుంట్లం గ్రామం వద్ద గోదావరి నదిని దాటి మంచిర్యాల జిల్లా బోరెంపల్లి గ్రామం వైపు వెళ్ళినట్లు అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement