న్యూఢిల్లి, (ప్రభన్యూస్): చెరకు నుంచి సేకరించి పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ ధరను లీటర్‌పై రూ. 1.47 మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నుంచి ప్రారంభమయ్యే మార్కెటింగ్ ఏడాది 2021-22లో ధర పెంపు ఆచరణలోకి వస్తుందని వివరించింది. 2025 నాటికి పెట్రోల్ మిశ్రమంలో ఇథనాల్ వాటా 20 శాతానికి చేర్చాలనే లక్ష్యంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్(సీసీ ఈఏ) బుధవారం సమావేశమైంది. ఈబీపీ(ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్) ప్రోగ్రామ్ కింద వేర్వేరు ముడిపదార్థాల ఆధారంగా ఇథనాల్ రేట్లను పెంచేందుకు సీసీఈఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఈ భేటీకి సంబంధించిన వివరాలను ఇన్ఫర్మేషన్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రి అనురాగ్ థాకూర్ వెల్లడించారు. రూ.1.47 మేర పెంపుతో లీటర్ ఇథనాల్ ధర రూ.62.65కి చేరుతుందని ఆయన చెప్పారు. సీ-హెవీ మొలాసిస్ నుంచి సేకరించిన ఇథనాల్ రేటు రూ.46.66కి, బీ-హెవీ నుంచి సేకరించిన ఇథ నాల్ ధర రూ.59.08కి చేరుతుందని ఆయన తెలిపారు. కాగా పెట్రోల్‌లో ఇథనా ల్‌ను ఎక్కువ మొత్తంలో కల పడం ద్వారా ఇతర దేశాల నుంచి ఇంధన దిగుమ తులు తగ్గుదలలో దోహదపడ తాయి. అంతేకాకుండా చెరుకు రైతులు, సుగర్ మిల్లులకు లబ్ది చేకూరుతుంది.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily