హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం ఎక్కువవుతోంది. ప్రజలు కూడా ఓటు వేసేందుకు క్యూ కడుతున్నారు. ఈ పోలింగ్ మరో రెండుగంటల్లో ముగియనుంది. కాగా సాయంత్రం 5 గంటలకు పోలింగ్ 76.26 శాతానికి చేరింది. కాగా పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. గంట గంటకు పది శాతం పోలింగ్ పెరుగుతుందంటం విశేషం. దీంతో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. 2018 ముందస్తు ఎలక్షన్ సమయంలో 84.5 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం దీన్ని అధిగమించే అవకాశం కనిపిస్తోంది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. మధ్యాహ్నం నుంచి యువత పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువగా కనిపిస్తున్నారు. హుజూరాబాద్‌లో మొత్తం 2,36,283 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 1,18,720 మంది పురుష ఓటర్లు, 1,17,563 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గతంలో ఉన్న ఓటర్ల కన్నా కొత్తగా 10 వేల వరకు కొత్త ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడక్కడ చెదురు మదురు సంఘటనలు జరిగినా..సమయం దగ్గరపడే కొలద్ది పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.