Monday, November 25, 2024

మండనున్న చమురు ధరలు, రష్యాపై పశ్చిమదేశాల ఆంక్షలు

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని జేపీ మోర్గాన్‌ అంచనా వేస్తోంది. ఉక్రెయన్‌పై దండయాత్రకు దిగిన రష్యాపై ఐరోపా, అమెరికా, బ్రిటన్‌ సహా పలు దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో రష్యా కుతకుతలాడుతోంది. ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతో ముడి చమురు ఉత్పత్తిని తగ్గిస్తే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఆకాశాన్నంటుతాయని హెచ్చరించింది. కనీసం బ్యారెల్‌ ధర 380 డాలర్లకు తాకొచ్చని అంచనా వేస్తోంది. రష్యా చమురు ధరలను నియంత్రించడానికి, ఆ దేశంపై మరింత ఒత్తిడి పెంచడానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే దిశగా జి-7 దేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. తమ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం లేని విధంగా రోజుకు కనీసం 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు రష్యా ప్రయత్నిస్తోందని జేపీ మోర్గాన్‌ విశ్లేషకుడుు నటాషా కనేవా అభిప్రాయపడుతున్నారు.

అయితే, దీని ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగానే ఉంటుంది. రష్యాలో రోజువారీ ఉత్పత్తి 30 లక్షల బ్యారెళ్ల మేర తగ్గితే నేరుగా లండన్‌ మార్కెట్‌పై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. అదే జరిగితే బ్యారెల్‌ ధర అంతర్జాతీయ మార్కెట్లో 190 డాలర్లకు, 50 లక్షల బ్యారెళ్ల మేర ఉత్పత్తి తగ్గితే, బ్యారెల్‌ ధల 380 డాలర్లకు పెరుగుతుందని అంచనా వేశారు. నిజానికి రష్యా చమురుపై ఐరోపా దేశాలు ఎక్కువగా ఆధారపడ్డాయి. తమ అవసరాల్లో సగానికి పైగా ఆ దేశంపైనే ఆధారపడుతున్నాయి. అయితే, ఉక్రెయిన్‌పై దండయాత్ర తరువాత రష్యాను ఆర్థికంగా నిలువరించడానికి ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో రష్యానుంచి చమురు కొనుగోలును నిలిపివేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాయి. కాగా భారత్‌, చైనా సహా ఆసియా మార్కెట్లలో చమురు విక్రయాలకు రష్యా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement