Saturday, November 23, 2024

రాష్ట్రంలో పెరుగుతున్న భ్రూణహత్యలు.. ఆగని లింగ నిర్ధారణా పరీక్షలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే అంతమొందిస్తున్నారు. పుట్టేది ఆడపిల్లా..? కాదా అన్న లింగానిర్ధారణ పరీక్షలపై తెలంగాణ రాష్ట్రంలో (1994 భ్రూణహత్యల నివారణా చట్టం) నిషేధం అమలవుతున్నా ఆచరణలో పాటించే స్కానింగ్‌ సెంటర్లు, ప్రయి వేటు ఆసుపత్రులు, దంపతులు చాలా అరుదు. తల్లి గర్భంలో పెరుగుతోంది ఆడపిల్ల అని తెలియగానే అంతమొందిస్తున్నారు. రాష్ట్రంలో ఏటా భ్రూణహత్యలు పెరిగిపోతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా ఆడపిల్ల అందరికీ దూరమవుతోంది. తెలంగాణలో బ్రూణ హత్యలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అమ్మ కడుపులో నలుసు ఆడబిడ్డ అని తెలియగానే నలిపివేసే విష సంస్కృతి చాపకింద నీరులా నిరాఘాటంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని స్కానింగ్‌ సెంటర్లలో యథేచ్ఛగా లింగనిర్ధారణా పరీక్షలు మూడోకంటికి తెలియ కుండా జరుగుతున్నాయి. గర్భనిర్ధారణ అయిన మూడు నెలలకు పిండం ఎలా ఉంది అని స్కానింగ్‌ ద్వారా వైద్యులు తెలుసుకుంటారు. ఈ స్కానింగ్‌ టెస్టులో లింగనిర్ధారణ చేయడం, గర్భంలో ఉంది బాబునా..?, పాపనా..? అన్న విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపడం చట్టరిత్యా నేరం. నిబంధనలను ఉల్లంగిస్తే ఆసుపత్రి, స్కానింగ్‌ సెంటర్‌ను సీజ్‌ చేయడంతోపాటు సదరు వైద్యుడిపై చర్యలు కూడా తీసుకోవచ్చని చట్టం చెబుతోంది.
ఆడపిల్ల అని నిర్దారణ

- Advertisement -

కాగానే భ్రూణహత్యలు…

ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు అన్ని పట్టణాల్లో కొన్ని స్కానింగ్‌ సెంటర్లు, ఆసుపత్రులు నిబంధనలకు విరుద్దంగా లింగనిర్ధారణా పరీక్షలు, ఆడపిల్ల అని తెలిసాక అబార్షన్‌ (బ్రూణహత్య) చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లింగనిర్ధారణ పరీక్ష, బ్రూణహత్యలు చేసి వేలాది రూపాయలను ఫీజుల రూపంలో దండుకుంటున్నారు. గర్భంలోని పిండం వయసును బట్టి మరీ రేటును పెంచుతూ వసూళ్లకు పాల్పడు తున్నారు. ఆడపిల్ల అని తెలియగానే స్థానికంగా గ్రామాల్లో ఉండే ఆర్‌ఎంపీల ద్వారా దంపతులు ప్రయివేటు ఆసుపత్రులను సంప్ర దించి అబార్షన్‌ చేయించు కుంటు న ా్నరు. లింగనిర్ధారణా పరీక్షకు కనీసం రూ.15వేలు, భ్రూణ హత్య కు కనీసం రూ.30 వలు ఆ పైనే వసూలు చేస్తున్న ఉదం తాలు రాష్ట్రం లోని పలు స్కానింగ్‌ సెంట ర్లు, ఆసుపత్రుల్లో నిత్యకృత్యమయ్యాయి. ఇక అవాంఛిత గర్భస్రావాల విషయంలోనూ రూ.50 వేల నుంచి రూ.60వేల వరకు ప్రయివేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు పట్టణాల్లో కొనసాగుతున్న స్కానింగ్‌ సెంటర్లు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహించ డంతోపాటు వైద్యుల సహకారంతో విచ్చలవిడిగా అక్రమంగా భ్రూణహత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. భ్రూణ హత్యలు చేయడంలో కొందరు సీనియర్‌ వైద్యులు ఆరితేరా రన్న ఆరోపణలు వెల్లువలా వినిపిస్తున్నాయి. వైద్యులకు కమిషన్లు ఇస్తూ స్కానింగ్‌ సెంటర్ల యజమానులు లింగనిర్ధా రణా పరీక్షలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.

మామూళ్ల మత్తుల్లో వైద్యాధికారులు..

తమ పరిధిలో లింగనిర్ధారణా పరీక్షలు, బ్రూణహత్యలు విచ్చలవిడిగా జరుగుతున్నా ఆయా ప్రాంతాల వైద్యాధి కారులు, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధి కారులు మామూళ్లు తీసుకుంటూ చోద్యం చూసు ్తన్నారన్న విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. అసలు ప్రయివేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాలపై వైద్యాధికారుల వద్ద సరైన లెక్కలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రయివేటు ఆసుపత్రులు చెప్పిన లెక్కలే రికార్డులు నమోద వుతున్నాయి. లింగ నిర్ధారణా పరీక్షలు చేస్తున్న స్కానింగ్‌ సెంటర్లు, అబార్షన్లు చేస్తున్న ఆసుపత్రులు ఒక్క కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పట్టణంలోనే సుమారు 30 వరకు ఉన్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా వారం రోజుల క్రితం యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో అక్రమంగా అబార్షన్లు చేస్తున్నట్లు గుర్తించి సూర్యా ఆసుపత్రిని అధికారులు సీజ్‌ చేసిన విషయం విధితమే.

కానరాని భ్రూణహత్యల
నివారణ కమిటీలు…

భ్రూణహత్యలను నివారించేందుకు పలుశాఖల సమన్వయంతో జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండడం లేదు. మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య, ఆరోగ్యశాఖ, పోలీసుశాఖ, రెవెన్యూ శాఖల అధికారులు జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో తరచూ ఆసుప త్రులు, స్కానింగ్‌ సెంటర్లను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే క్షేత్రస్తాయిలో ఈ కమిటీల ప్రభావం మచ్చుకైనా కానరాకపోవడంతో ప్రయివేటు ఆసుపత్రుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది.

తగ్గిపోతున్న స్త్రీ పురుష నిష్పత్తి…

గర్భంలోనే ఆడపిల్లలను చిదిమేస్తుండడంతో సమాజంలో స్త్రీ పురుష నిష్పత్తిలో ఊహించనంత తేడా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో వివాహానికి ఆడపిల్లలు దొరకని పరిస్థితులు ఎంతోదూరం లేవని వైద్య నిపుణులు, సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి 1000:934గా ఉంది. ఈ వ్యత్యాసం మరింత పెరిగే ప్రమాదముందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement