Thursday, November 21, 2024

పెరుగుతున్న క్రూడాయిల్‌ ధరలు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయని, వార్‌ కారణంగా సప్లయి చైన్‌ దెబ్బతిన్నదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ గుర్తు చేశారు. బ్రెంట్‌ క్రూడాయిల్‌ సోమవారం 3 శాతానికి పైగా పెరిగిందన్నారు. కొన్ని రోజుల క్రితం వరకు 99 డాలర్లు పలికిన బ్యారెల్‌ ధర.. సోమవారం మళ్లిd 112 డాలర్లకు ఎగబాకిందని తెలిపారు. ఈ పరిస్థితులు ఇంధన రంగంలో ఆందోళనలకు గురి చేస్తున్నాయన్నారు.

ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా చాలా దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు పరుగులు పెడుతున్నారన్నారు. చాలా దేశాలు గ్రీన్‌ ఎనర్జీ, ఎలక్ట్రిక్‌ వ్యవస్థను ఎంచుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్‌ సమస్య కారణంగా ఏర్పడిన చమురు సంక్షోభం పునరుత్పాదక ఇంధనం వైపు మరింత వేగంగా దూసుకుపోతున్నదని అన్నారు. ముడి చమురు కొరత కారణంగా గ్రీన్‌, పునరుత్పాదక శక్తికి డిమాండ్‌ పెరిగిందని చెప్పుకొచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement