Wednesday, November 20, 2024

పంత్ ఐసోలేషన్ పూర్తి..మరోసారి కోవిడ్ పరీక్షలు

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే..అయితే నిన్నటితో పంత్ తన పదిరోజుల ఐషోలేషన్ ను పూర్తి చేసుకున్నాడు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ త‌ర్వాత మూడు వారాల బ్రేక్ దొర‌క‌డంతో బ‌బుల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన పంత్‌కు ఈ నెల 8న క‌రోనా సోకింది. నిబంధనల ప్రకారం 10 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకున్నప్పటికి పంత్ కి కరోనా పరీక్షల్లో నెగటివ్ తేలాల్సి ఉంది. నిన్న పంత్ కి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో పంత్ కు నెగటివ్ గా తేలితే అప్పుడు టీమ్ తో పాటు బయోబబుల్ లో చేరతాడు.

ఇంగ్లండ్‌లోని తన బంధువుల ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటున్న పంత్ త్వరలోనే జట్టులో చేరే అవకాశం ఉంది. కాగా, వృద్ధిమాన్ సాహా, రిజర్వు ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌లు ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్నారు. ప్రాక్టీస్ మ్యాచ్ సమయానికి పంత్ ఐసోలేషన్ పూర్తిచేసుకున్నప్పటికీ అతడి మరింత విశ్రాంతి అవసరమని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. పంత్, సాహా ఇద్దరూ తొలి టెస్టు సమయానికి అందుబాటులోకి వస్తారని ఆయన పేర్కొన్నారు.  ఇక శుభ్‌మ‌న్ గిల్ కూడా గాయం కార‌ణంగా ఇంగ్లండ్ సిరీస్‌కు దూరం కావ‌డంతో రోహిత్ శ‌ర్మతో క‌లిసి మ‌యాంక్ అగ‌ర్వాల్ ఓపెనింగ్ చేయ‌నున్నాడు.

ఇది కూడా చదవండి : షో రూమ్ మొదటి అంతస్థు నుంచి కారు బోల్తా…తరువాత ఏమైందో తెలుసా ?

Advertisement

తాజా వార్తలు

Advertisement