టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తాను వేగంగా కోలుకుంటున్నట్లు చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఫోటో రిలీజ్ చేశాడు. ఇందులో వాకింగ్ స్టిక్స్ పట్టుకొని నడుస్తున్నాడు పంత్. ఈ ఫోటోకు ‘ఒక అడుగు ముందుకు సాగడానికి.. ఒక అడుగు మానసికంగా ధృడంగా మరడానికి.. ఒక అడుగు బెటర్ లైఫ్ కోసం’ అంటూ పాజిటివ్ క్యాప్షన్ ఒకటి జత చేశాడు. పంత్ పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పంత్ త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. .
Advertisement
తాజా వార్తలు
Advertisement