Friday, November 22, 2024

వచ్చే ఏడాది మరింత రాణిస్తాం: రిషబ్ పంత్

కోల్‌కతా నైట్‌‌రైడర్స్‌తో బుధవారం జరిగిన క్వాలిఫయర్ 2లో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించి కీలక మ్యాచ్‌ల్లో ఓడి ఉత్త చేతులతో నిష్క్రమించడం చాలా బాధగా ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అన్నాడు. తన ఫీలింగ్ ఎంటో చెప్పడానికి మాటలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బ్యాటింగ్‌లో విఫలమైనా.. బౌలర్లు అద్భుతంగా పోరాడారని చెప్పుకొచ్చాడు. కానీ తృటిలో విజయాన్ని చేజార్చుకున్నామని తెలిపాడు.

‘నా ఈ బాధను వర్ణించడానికి మాటల్లేవు. విజయం సాధిస్తామని ఆఖరి క్షణం వరకు నమ్మకంతోనే ఉన్నాం. వీలైనంతవరకు గేమ్‌ను చివరి వరకు తీసుకెళ్లాళనుకున్నాం. బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు విజయాన్ని అందుకోలేకపోయాం. అయితే కేకేఆర్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా పవర్ ప్లే ముగిసిన తర్వాత కట్టడి చేశారు. మిడిల్ ఓవర్లలో పరుగులు చేయలేక తీవ్రంగా ఇబ్బందిపడ్డాం. స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయాం. సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేయలేకపోయాం. ఈ ఏడాది అద్భుతంగా రాణించాం. ఒకరికొకరం అండగా నిలుస్తూ రాణించడం. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. వచ్చే ఏడాది మరింత బలంగా తయారై మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తాం’ అని పంత్ చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement